Balakrishna : వైరల్ అవుతున్న బాలకృష్ణ ‘మెంటల్’ సర్టిఫికెట్.!

NQ Staff - September 24, 2022 / 10:13 PM IST

Balakrishna : వైరల్ అవుతున్న బాలకృష్ణ ‘మెంటల్’ సర్టిఫికెట్.!

Balakrishna : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గతంలో ఓ కేసులో ఇరుక్కున్న విషయం విదితమే. నిర్మాత బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో ఓ జ్యోతిష్యుడు కూడా అక్కడే వున్నాడు. బాలకృష్ణ ఇంట్లోనే ఈ ఘటన జరిగింది.

కాగా, అదే ఇంట్లో ఓ సెక్యూరిటీగార్డు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. వరుసగా జరిగిన ఈ ఘటనలు అప్పట్లో పెను రాజకీయ దుమారానికి కారణమయ్యాయి.

బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్..

ఇంట్లో కాల్పుల ఘటనకు సంబంధించి బాలకృష్ణ, ‘మానసిక పరిస్థితి’కి సంబంధించిన ‘లూప్ హోల్’ పట్టుకున్నారు. అప్పట్లో నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, నందమూరి బాలకృష్ణను గట్టున పడేశారు. కేసుని డైవర్ట్ చేసేందుకు బాలకృష్ణకి మెంటల్ సర్టిఫికెట్ కూడా అప్పట్లో జారీ చేయడం గమనార్హం.

మానసిక పరిస్థితి సరిగ్గా లేదంటూ సర్టిఫికెట్ జారీ చేయించి, బాలకృష్ణని ‘సేఫ్ జోన్’లో పడేయగా, అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బాలకృష్ణకి సహాయం చేశారని చెబుతారు. ఆ విషయాన్ని ఏపీ మంత్రి జోగి రమేష్ ప్రస్తావించారు. ‘వైఎస్ కుటుంబానికి నువ్వు రుణపడి వున్నావ్.. విశ్వాసంగా పడి వుండు.. ఎగిరెగిరి పడకు..’ అంటూ జోగి రమేష్ హెచ్చరించారు బాలకృష్ణకి.

మరోపక్క, అప్పట్లో బాలకృష్ణకి ఇచ్చిన ‘మానసిక స్థితి’ తాలూకు సర్టిఫికెట్ ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి పేరుని హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగించడంపై మండిపడుతూ బాలయ్య ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.. అందులో ‘శునకాలు, కుక్కలు..’ అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ ఈ మెంటల్ సర్టిఫికెట్.

 

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us