Balakrishna: నా సోద‌రి జోలికి వ‌స్తే మెడ‌లు విరిచేస్తా.. ఖ‌బ‌డ్ధార్ అంటూ బాల‌కృష్ణ వార్నింగ్

Balakrishna: ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు..చంద్రబాబు కన్నీరు పెట్టటం పైన పలువురు రియాక్ట్ అవుతున్నారు. అసెంబ్లీలో జరిగిన వాదోపవాదనల నడుమ వైసీపీ నేతలు తమ సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడారంటూ చంద్రబాబు బోరున విలపించారు. ఆయన విలపించిన తీరు పైన రాజకీయంగా కలకలం రేగింది.దీనిపై బాల‌కృష్ణ నిప్పులు చెరిగారు.

balakrishna angry on ycp mla's (1)
balakrishna angry on ycp mla’s (1)

ఇళ్లల్లోని మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే చేతులు ముడుచుకొని కూర్చోలేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. వీళ్లు మారాలని..మారకపోతే మెడలు వంచి మారుస్తామంటూ వ్యాఖ్యానించారు. పరిణామాలు బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేసారు. సజావుగా జరగాల్సిన అసెంబ్లీ, దారుణంగా ప్రవర్తించారు. చాలా ధైర్యంగా ఉండే చంద్రబాబు లాంటి మనిషి.. కన్నీరు పెట్టుకున్నారని బాలయ్య చెప్పుకొచ్చారు.

మిమ్మల్ని మీరు కాపాడుకోండంటూ బలయ్య హెచ్చరించారు. ఎన్టీఆర్ వారసుల మరో అవతారం చూడాల్సి ఉంటుందని భువనేశ్వరి సోదరి వార్నింగ్ ఇచ్చారు. నందమూరి రామక్రిష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. ఓరేయ్ కొడాలి నాని.. వంశీ..అంబటి రాంబాబు.. ద్వారంపూడి జాగ్రత్తగా ఉండాలని నందమూరి రామక్రిష్ణ హెచ్చరించారు.

అంశాల మీద మాట్లాడుతాం..వారికి సూచనలు ఇవ్వటం..నిలదీయం జరిగేది. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. మహిళా ప్రతినిధులు సైతం అసెంబ్లీలో ఉన్నారు. సవాళ్లు – ప్రతి సవాళ్లు సహజం. వ్యక్తిగత అజెండాతో మాట్లాడటం సరి కాదు. ఎవరి గరించి మాట్లాడని సంస్కారం మనది. మా సోదరి భువనేశ్వరి పైన వ్యక్తిగతంగా మాట్లాడటం సరి కాదుని బాలయ్య చెప్పారు.

వారి భాష..వ్యాఖ్యలు బాధాకరమని చెప్పుకొచ్చారు.. గొడ్ల చావిడిలో ఉన్నామా..అసెంబ్లీలో ఉన్నామా అన్నట్లుగా ఉంది. చంద్రబాబు మీద మాట్లాడచ్చు. వ్యక్తి గతంగా రాజకీయంగా సంబంధం లేని మహిళ పైన మాట్లాడారని ఫైర్ అయ్యారు. ఆడవాళ్ల జోలికి వస్తే చేతులు ముడుచుకొని కూర్చోం. వాళ్ల ఇంట్లోని అంశాన్ని దారి తప్పించేందుకు ఇటువంటి భాష వినియోగిస్తారా అని ప్రశ్నించారు.

చదువుకున్న వాళ్లు సైతం అక్కడ సభ్యులుగా ఉన్నా..వారు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సభాపతి ఏం చేస్తున్నారో అర్దం కావటం లేదని బాలయ్య వ్యాఖ్యానించారు. మైండ్ గేమ్ ఆడుతున్నామని మీరు అనుకుంటున్నారు..రేపు మేము ఉండవచ్చంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని…చంద్రబాబు అనుమతి కూడా ఇక తమకు అవసరం లేదని..చూస్తూ ఊరుకొనేది లేదని బాలయ్య తేల్చి చెప్పారు.

పార్టీ కార్యకర్తలు..అభిమానులు..నందమూరి కుటుంబం నుంచి హెచ్చరిస్తున్నా…ఖబడ్దార్. ఇలాంటి మాటలు మాట్లాడితే భరతం పడతామని బాలయ్య హెచ్చరించారు. మీ వ్యవస్థలు తమను అడ్డుకోలేవని..అన్నింటినీ బద్దలు చేసి బుద్ది చెబుతామని బాలయ్య తేల్చి చెప్పారు.