Anandayya: ఆనందయ్యా.. ఇన్నాళ్లూ ఎక్కడున్నావయ్యా..

Anandayya: ఆనందయ్య మందుకి అందరూ ఆల్ రైట్ చెబుతున్నారు. ఆయుష్ విభాగం ఇప్పటికే రెండు మూడు సార్లు ఓకే అనేసింది. ఇవాళ సోమవారం మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఔషధాన్ని నాటు మందు అంటూ మోటుగా అవమానించొద్దని సూచించింది. అది మంది మెచ్చిన మందు అని పేర్కొంది. దాన్ని వాడిన చాలా మంది లబ్ధి పొందామని చెబుతున్నారు. ఆనందయ్య మెడిసిన్ వినియోగదారుల సంఖ్య 70 వేల నుంచి 80 వేల మంది వరకు ఉన్నారని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. అంత భారీగా కస్టమర్లు ఉన్నప్పుడు అందులో ఒకరిద్దరికి ఏవైనా ఇబ్బందులు వచ్చినా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని ఆయుష్ విభాగం కమిషనర్ రాములు మీడియాకి తెలిపారు.

Anandayya Medicine

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18..

ఆనందయ్య పసరు పవర్ ఫుల్. అందులో హాని చేసే పదార్థాలేవీ లేవు. దాని తయారీకి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 మూలికలను వాడుతున్నారు. వాటిపై లోతుగా, పూర్తిగా చర్చించాం. వీటన్నింటినీ ఆయుర్వేద శాస్త్రం ఒప్పుకుంటోంది. అయితే దీన్ని ఆయుర్వేద ఔషధంగా అధికారికంగా గుర్తించాలంటే రూల్స్ ప్రకారం కొన్ని సమస్యలు ఉన్నాయి. క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ బుక్స్ లో లేని ఏ మందుకైనా క్లినికల్ ట్రయల్స్ జరపాలి. ఏ మూలికలను ఎంత మోతాదుతో వాడుతున్నారనేదీ ముఖ్యమే. అందువల్ల ఆనందయ్య ఔషధాన్ని కరోనాకు ముందుగా పరిగణనలోకి తీసుకోలేమని రాములు స్పష్టం చేశారు.

Anandayya Medicine

సీఎం ఇష్టం..

ఆనందయ్య మెడిసిన్ ఉపయోగకరమైందే. అందులో నో డౌట్. దాన్ని వాడటం వల్ల వైద్యపరంగా భవిష్యత్తులో ఏవైనా సమస్యలు తలెత్తుతాయా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఆనందయ్య మెడిసిన్ ని కంట్లో వేస్తున్నారు కాబట్టి నేత్ర వైద్య నిపుణుల అభిప్రాయాన్నీ తీసుకుంటాం. కంట్లో వేసే చుక్కలపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అవీ తొలిగిపోతే చివరగా ఓ నిర్ణయానికి రావొచ్చు. కళ్లలో వేసే పసరులో మూడు రకాల పదార్థాలను వాడుతున్నారు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఆ మూడింటి వల్లా నష్టం లేదు. ఆనందయ్య స్వగ్రామంలో కరోనా కేసులు తక్కువ ఉన్నట్లు తేలింది. స్వల్ప సంఖ్యలో కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఏదేమైనా స్థానికులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించాం. నాలుగైదు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందని ఆయుష్ విభాగం కమిషనర్ రాములు పేర్కొన్నారు. ఈయన చెప్పినదాన్నిబట్టి చూస్తే ఆనందయ్య వైద్యానికి తిరుగులేదని అర్థమవుతోంది. అందుకే దేశం మొత్తం ‘‘అయ్యా ఆనందయ్యా ఇన్నాళ్లూ నువ్వు ఎక్కడున్నావయ్యా’’ అంటున్నారు.

Anandayya Medicine