YS Vivekananda Reddy : సోమవారం వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు
NQ Staff - March 10, 2023 / 04:51 PM IST

YS Vivekananda Reddy : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు వాదనలు వినడం జరిగింది.
ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తి చేసిన హైకోర్టు అవినాష్ రెడ్డిని సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం సిబిఐ అందజేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
ప్రస్తుతం అవినాష్ రెడ్డి యొక్క విచారణ ఏ దశలో ఉందో చెప్పాలని కోర్టు పేర్కొంది. సిబిఐ అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తల నేపథ్యంలో అవినాష్ రెడ్డి ముందస్తుగా కోర్టు నుండి ఇలాంటి ఆదేశాలు తీసుకు రావడం జరిగిందని ప్రచారం జరుగుతుంది.
సోమవారం తర్వాత అయినా ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతుంది. వివేకా హత్య కేసు విచారణలో అవినాష్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడట. వివేకా రెండవ భార్య కొడుకుకి ఆస్తి వెళ్తుందనే ఉద్దేశ్యంతో కుటుంబ సభ్యులు హత్య చేయించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశాడు.