ఎనీ టైమ్ టీడీపీ మాజీ మినిస్టర్ అరస్ట్ ?

ఏపీలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు దేశం పార్టీ నాయకులకు నిద్ర పట్టడం లేదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన అందరిలో కనిపిస్తుంది. ఈ సమయంలోనే మంత్రి పై దాడి కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒక తాపి మేస్త్రీ ఇటీవల మంత్రి పేర్ని నానిపై దాడికి ప్రయత్నించాడు. ఆ దాడిలో మంత్రికి ఏం కాలేదు. అయితే దాడికి ప్రయత్నించిన వ్యక్తిని ప్రశ్నించగా తాగి ఉండి పని లేదనే ఆవేశంతో చేశాను అన్నాడు. తన వెనుక ఎవరు లేరు అంటూ అతడు చెబుతున్నాడు. కాని అతడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారేమో అనే అనుమానంను వ్యక్తం చేస్తున్నారు.

at any moment kollu ravindra may be arest in minister perni nani attack case
at any moment kollu ravindra may be arest in minister perni nani attack case

ఆ తాపి మేస్త్రీ ఒక వైకాపా నాయకుడికి బంధువుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఈ సమయంలోనే తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకుల వల్ల అతడు ఈ దాడికి ప్రయత్నించాడు అంటూ బలంగా వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. దాంతో ఇప్పుడు టీడీపీ నాయకులకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించాడు. పని లేక కడుపు మండిన కర్షకుడు దాడికి దిగితే తాను దాడి చేయించాను అంటూ మాట్లాడటం ఏంటీ అంటూ కొల్లు రవీంద్ర తనపై వస్తున్న ఆరోపణలు కొట్టి పారేస్తూ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ నాయకులను ఎలాగైనా ఇన్వాల్వ్‌ చేయాలనే ఉద్దేశ్యంతో చాలా మంది వైకాపా నాయకులు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

ఈసమయంలో టీడీపీ నాయకుడు ఒక మంత్రి పై జరిగిన దాడికి వెనుక ఉన్నాడు అనే అనుమానం వచ్చినా కూడా వెంటనే అతడిపై చర్యలకు సిద్దం అయ్యే అవకాశం ఉంది. వైకాపా నాయకులు ఆ మాజీ మంత్రికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. మంత్రిపై దాడికి ప్రోత్సహించారు అంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను టార్గెట్‌ చేసి కొందరు ప్రచారం చేస్తున్నారు. దాంతో పోలీసులు ఏ నిమిషంలో అయినా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు ఈ విషయంలో చాలా ఆందోళనతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈమద్య కాలంలో తెలుగు దేశం పార్టీ నాయకులు వరుసగా అరెస్ట్‌ అవ్వడం లేదంటే ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కోవడం చేస్తున్నారు. కనుక కొల్లు రవీంద్ర పరిస్థితి ఏంటో అంటూ ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.

Advertisement