AP, telangana : ఏపీ రెడ్డిని ఫాలో కాబోతున్న తెలంగాణ రెడ్డి

AP, telangana : ఏపీ రెడ్డి అనగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ రెడ్డి అనగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. వీళ్లద్దరికీ ‘రెడ్డి’ అనే ఒక్క అంశం మాత్రమే కామన్ గా లేదు.. ఇంకా చాలా పోలికలున్నాయి. అవి వ్యక్తిగతమైనవి, శారీరకపరమైనవి కావు. పొలిటికల్ పోలికలు. అందుకే తెలంగాణ రెడ్డి ఇప్పుడు రాజకీయంగా ఏపీ రెడ్డిని ఫాలో కాబోతున్నాడని అంటున్నారు.

సొంత పార్టీ..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ (వైఎస్సార్సీపీ) పెట్టుకున్నాడు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా ఆ హస్తం పార్టీ నుంచే లాగౌట్, సైనౌట్ అవుదామని అనుకుంటున్నాడు. వైఎస్ జగన్ లోక్ సభ ఎంపీగా ఉన్నప్పుడే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పాడు. ప్రజెంట్ గా రేవంత్ రెడ్డి కూడా అదే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి సేమ్ లోక్ సభ ఎంపీ.

కేసులు: AP, telangana

జగన్ పైన కేసులున్నాయి. రేవంత్ రెడ్డి పైనా ఉన్న విషయం తెలిసిందే. జగన్ జైలుకు వెళ్లి వచ్చాడు. రేవంత్ రెడ్డిదీ అదే అనుభవం. జగన్ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. రేవంతూ ఆ పనిలోనే ఉన్నాడు. జగన్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సీనియర్లు సహకరించలేదు. ప్రస్తుతానికి రేవంత్ పరిస్థితీ అలాగే ఉంది. ఇద్దరూ యూత్ లీడర్లే. తెలుగు రాష్ట్రాల నాయకులే. బోలెడంత భవిష్యత్తు ఉంది.

ఇంకేం?..

జగన్, రేవంత్ ఇద్దరూ పవర్ లో ఉన్న పార్టీలతో ఫైట్ చేసినవాళ్లే. మొండి ధైర్యంతో నిలదొక్కుకున్నవాళ్లే. ఈ నేపథ్యంలో రేవంత్ జగన్ బాటలో నడిస్తే తప్పేంటి అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. జగన్ లాగే రేవంత్ సీఎం అవుతాడా లేదా అనేది పక్కన పెడితే సొంతగా పోరాడితే పోయేదేముంది. బానిస సంకెళ్లు తప్ప. బాంచన్ దొర అంటూ ఢిల్లీ పెద్దలకు కాల్మొక్కాల్సిన గతి తప్పుతుంది.

AP, telangana : same political situation of two leaders
AP, telangana : same political situation of two leaders

ఛాన్సుందా?: AP, telangana

రేవంత్ గనక తెలంగాణలో సొంతగా పార్టీ పెడితే తన కాళ్ల మీద తాను ఎదగటానికి బొచ్చెడంత స్కోపుంది. రాష్ట్రంలో ఆర్థికంగా ఎప్పటి నుంచో రెడ్లదే ఆధిపత్యం. ఒకప్పుడు పెత్తనం చెలాయించిందీ వాళ్లే. కేసీఆర్ పై కస్సున లేచే రేవంత్ రెడ్డికి యువతలో జబర్దస్త్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు గనక రేవంత్ సొంత పార్టీ పెట్టకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్థానాన్ని బండి సంజయ్ భర్తీ చేయటానికి కాచుకొని కూర్చున్నాడు. ఇప్పటికే చాప కింద నీరు లెక్క పాకిపోతున్నాడు. కమాన్ రేవంత్.

Advertisement