‘ సర్వ నాశనం ‘ దిశగా చంద్రబాబు పార్టీ ? కారణం ఆవిడే ?

టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పదవి ఎంపిక విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ తమ పార్టీ నేతలకు తీవ్ర నిరాశనే మిగుల్చుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత ఎర్రన్నాయుడు బ్రతికుండగానే అతన్ని పక్కన పెట్టి అతని సోదరుడైన అచ్చెన్నాయుడుని బాగా ఎంకరేజ్ చేసి కీలక పదవులు కట్టబెట్టారు. ఎర్రన్నాయుడు చనిపోయిన తరువాత అతని కుమారుడైన రామ్మోహన్ నాయుడు కి ఎంపీ పదవిని ఇచ్చారు.

 

మాజీ మంత్రి, సీనియర్ నేత గౌతు శ్యామ సుందర శివాజీ కూతురైన గౌతు శిరీషకు గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని పలాసా టికెట్ ఇచ్చారు. కొద్దిరోజుల పాటు శ్రీకాకుళం జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన ఆమెను ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు చంద్రబాబు. ఇక ఆంధ్ర ప్రదేశ్ తెదేపా మాజీ ప్రెసిడెంట్ కళా వెంకటరావుకు పొలిట్ బ్యూరో మెంబర్ షిప్ ఇచ్చిన చంద్రబాబు.. ఆయన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడికి రాష్ట్ర కారదర్శి పదవిని కట్టబెట్టారు. ఇక ఆయన మరదలు కిమిడి మృణాళినికి మంత్రి పదవి ఇచ్చారు. గత ఎన్నికలలో మృణాళిని కొడుకు కిమిడి నాగార్జునకు చీపురుపల్లి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయనకు జిల్లా ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు.

prathiba bharathi

విశాఖ జిల్లా విషయానికి వస్తే.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని పొలిట్ బ్యూరో మెంబెర్ షిప్ ఇచ్చారు. అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. టీడీపీ నేతలందరి వారసులకు కీలక పదవులు అప్పజెప్పిన చంద్రబాబునాయుడు ఒకరి విషయంలో మాత్రం అన్యాయం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కావాలి ప్రతిభా భారతి టీడీపీ పార్టీని ఆదినుంచి నమ్ముతూ చంద్రబాబు నాయుడుకి విధేయురాలు గా ఉంటున్నారు. కానీ ఆయన మాత్రం ఆమెను పోలిట్ బ్యూరో నుంచి తొలగించి.. ఏదో పేరుకి పదవి ఇవ్వాలన్నట్టు జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమార్తె గ్రీష్మకు రాజాం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ప్రతిభా భారతి కోరారు కానీ చంద్రబాబు అందుకు నిరాకరించారు. ప్రస్తుతం రాజాం నగరంలో ఏ టీడీపీ రాజకీయ నేత కూడా క్రియాశీలకంగా లేరు. దీనితో రాజాం ఇన్ఛార్జిగా తన కుమార్తెను నియమించాలని ప్రతిభాభారతి చంద్రబాబు నాయుడిని కోరుతున్నారు. కానీ చంద్రబాబునాయుడు నుంచి ఎటువంటి సానుకూల స్పందన లభించడం లేదు.

దీంతో పార్టీలో కొనసాగుతున్న నేతలందరి వారసులకు మంచి పదవులు ఇచ్చి తన కుమార్తెకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రతిభా భారతి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు నాయుడు పార్టీ ని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని సిద్ధమవుతున్నారట. శ్రీకాకుళం జిల్లాలో వర్గ విభేదాలు వల్ల కూడా తనకు అన్యాయమే తప్ప న్యాయం జరగడం లేదని ప్రతిభా భారతి గుర్రుగా ఉన్నారట. ఐతే ప్రతిభా భారతి పట్ల చంద్రబాబు ఎందుకు పక్షపాతంగా ప్రవర్తిస్తున్నారో తెలుగు తమ్ముళ్ళకి కూడా అర్థం కావడం లేదట. ఇప్పటికే టీడీపీ పార్టీ సగం నాశనం కాగా.. చంద్రబాబు కీలక నేతలను పక్కన పెడుతుండంతో పార్టీ ఇంకా బలహీనపడుతోంది.

Advertisement