AP Students At IMF : ప్రపంచ బ్యాంక్ సందర్శనలో ఏపీ విద్యార్థులు.. ఇది కదా పాలన అంటే..
NQ Staff - September 27, 2023 / 03:10 PM IST

AP Students At IMF :
ఏపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ప్రపంచబ్యాంకు (IMF) డిప్యూటీ ఎండీ గీతా గోపినాథ్ విద్యకోసం చేపట్టిన సంస్కరణలు, విద్యార్థుల చదువు కోసం ఏపీ ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడిని ప్రత్యేకంగా అభినందించింది.

AP Students At IMF
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు తొలుత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.
అనంతరం వాషింగ్టన్ డీసీలోని ప్రపంచబ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని సైతం వారు సందర్శించారు. అక్కడ ఏపీ విద్యార్థులకు ఘన స్వాగతం లభించింది.IMF డిప్యూటీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన భారతీయురాలు గీతా గోపీనాథ్ విద్యార్థులను అప్యాయంగా పలకరించారు. ఈ మేరకు ఏపీ విద్యార్థులతో సెల్పీ దిగిన ఆమె ట్విట్టర్లో షేర్ చేయగా దానిని సీఎం జగన్ రీట్వీట్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.

AP Students At IMF
దీనంతటి కంటే ముందు ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థుల బృందం అమెరికాలోని ఐక్యరాజ్యసమితిలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు వెళ్లింది.ఆ తర్వాత వీరంతా కలిసి వాషింగ్టన్ డీసీలోని ప్రపంచబ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది.ఈ క్రమంలోనే IMF ప్రతినిధులతో ఏపీ విద్యార్థుల బృందం పలు కీలక అంశాలపై చర్చ జరిపారు.

AP Students At IMF
పేదరికం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని, అందుకు అనుగుణంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకొచ్చారని విద్యార్థుల బృందం ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు వివరించింది. అనంతరం ఐఎంఎఫ్ ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థుల బృందం సమాధానాలు చెప్పింది.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణల వలన సమాజంలో వచ్చిన మార్పులను విద్యార్థులు ప్రతినిధులకు వివరించే ప్రయత్నం చేశారు. తాము అమెరికా వరకు రావడానికి ఐక్యరాజ్యసమితి, ప్రపంచబ్యాంకు సందర్శించడానికి ఏపీ ప్రభుత్వం సంస్కరణలే కారణమని విద్యార్థులు తెలిపారు.

AP Students At IMF
రాష్ట్రంలో జగన్ సర్కార్ పేదరికం నిర్మూలన, విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని అందుకోసం జగనన్న విద్యాకానుక, అమ్మ ఒడి వంటి పథకాలతో పాటు నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, డిజిటల్ ఎడ్యూకేషన్, టోఫెల్ శిక్షణ, ట్యాబ్స్ పంపిణీ వంటివి అందచేస్తున్నారని వివరించగా ఏపీ ప్రభుత్వం పిల్లలకు చదువు చెప్పించేందుకు చేపట్టిన పెట్టుబడి చర్యలను వారు ఐఎంఎఫ్ ప్రతినిధులు ప్రశంసించారు.

AP Students At IMF
అనంతరం IMF డిప్యూటీ ఎండీ గీతాగోపీనాథ్ పిల్లలతో సెల్ఫీ దిగారు. ‘ఐఎంఎఫ్‌కు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను స్వాగతించడం నిజంగా ఆనందంగా ఉంది. వారి UN మరియు US పర్యటనలో భాగంగా వారు IMF ప్రధాన కార్యాలయంలో ఆగినందుకు నేను సంతోషిస్తున్నాను’ అని ట్వీట్ చేయగా..
‘మా పిల్లలను కలుసుకున్నందుకు, వారిని హృదయపూర్వకంగా స్వాగతించినందుకు ధన్యవాదాలు అంటూ సీఎం జగన్ రీట్వీట్ చేశారు. పిల్లల ప్రకాశవంతమైన చిరునవ్వులు చూస్తుంటే వారికి ఎలాంటి స్వాగతం లభించిందో అర్థమవుతోంది.

AP Students At IMF
విద్య అనేది వ్యక్తిగత జీవితాలను మార్చడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చడంలో అతిపెద్ద ఉత్ప్రేరకం అని నేను నిజంగా నమ్ముతున్నాను. మన పిల్లలే ఇందుకు నిదర్శనం.అంతర్జాతీయ వేదికపై మన రాష్ట్రాన్ని ఎంతో గర్వంగా, ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహిస్తున్న మన పిల్లలను చూసినప్పుడు నేను గర్వంతో నిండిపోయాను’ అని జగన్ స్పందించారు.

AP Students At IMF
‘మానవ వనరులపై పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషి చాలా గొప్పది.ఇది నిజానికి చాలా మంచి విషయం.వాస్తవానికి విద్యకు ప్రాధాన్యతనిచ్చే YSRCP ప్రభుత్వ విధానాలను ఇతర రాష్ట్రాలు తప్పనిసరిగా అనుకరించాలి’ అని ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా కె సుబ్రహ్మనియన్ ట్వీట్ చేశారు.
https://x.com/GitaGopinath/status/1706863622440587528?s=20