AP police boss : డీజీపీ గౌతమ్ సవాంగ్ నిజంగా తోపు, ఎంత పెద్ద కుట్రని చేధించారో తెలుసా?

AP police boss : ఏపీ పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ నిజంగా తోపని అందరూ మెచ్చుకుంటున్నారు. పెద్ద కుట్రని ఛేదించడంతో ఆయన ట్యాలెంట్ కి అంతా ఫిదా అవుతున్నారు. ‘డీజీపీ సూపర్ డూపర్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఆయన ఛేజ్ చేసిన కేసు ఏంటా అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఆరు నెలల కిందట ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామానికి చెందిన వెండుగమిల్లి ప్రసాద్ అనే దళిత యువకుడికి సీతానగరం పోలీస్ స్టేషన్ లో గుండు గీయించటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే కదా. అదిగో అతగాడే ఏపీ పోలీసులకు సవాల్ విసిరాడు.

ఏమని?..

గుండు గీయించిన నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనే కోపంతో తాను అడవుల్లోకి వెళ్లి అన్నలతో(నక్సలైట్లతో) కలవాలనుకుంటున్నానని బెదిరిస్తూ ఏకంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి లెటర్ రాసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ముందే చెప్పినట్లే ఈ నెల మూడో తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడికి పోయాడో తెలియక అతని భార్య ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తకు వైఎస్సార్సీపీవాళ్లతో శత్రుత్వం ఉందని, అందువల్ల వాళ్లేమైనా చేశారేమోనని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.

హైస్పీడ్: AP police boss

ప్రసాద్ కనిపించట్లేదంటూ ఐశ్వర్య ఇచ్చిన కంప్లైంట్ పై పోలీసులు హైస్పీడుగా కదిలారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపారు. అతని కోసం జల్లెడ పట్టారు. ఎట్టకేలకు ప్రసాద్ ఆచూకీని కనుక్కున్నారు. అయితే స్టోరీ ఇంతటితో అయిపోలేదు. అతని కోసం అడుగడుగునా వెతుకుతున్న క్రమంలో పోలీసులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. ప్రసాద్ అదృశ్యం వెనక పెద్ద కుట్ర కోణం ఉందని గుర్తించారు.

AP police boss : congratulations to ap dgp
AP police boss : congratulations to ap dgp

హర్ష కుమార్ కి..

ఏపీలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ప్రసాద్ సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని పెద్ద ప్లాన్ వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దురుద్దేశంతోనే కావాలనే కనిపించకుండాపోయిన అతణ్ని, అతనికి కోపరేట్ చేసిన మరొకతణ్ని అరెస్ట్ చేశారు. ప్రసాదుకి గుండు గీయించిన ఘటన నుంచి ఇప్పటివరకు అతనికి సంబంధించిన ఏ విషయమైనా ముందుగా మాజీ ఎంపీ హర్ష కుమారే స్పందిస్తున్నారు. అతను మిస్ అవటంపైనా తొలుత ఆయనే రియాక్ట్ అయ్యారు. దీంతో హర్షకుమార్ కి కూడా ఈ కుట్రలో పాత్ర ఉందా అనే కోణంలోనూ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

Advertisement