AP panchayat elections : సుప్రీంకోర్టు చెప్పినా.. డోంట్ కేర్. ఏపీలో మళ్లీ అదే వార్..

AP panchayat elections : ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చేట్లు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నువ్వెంతంటే నువ్వెంతంటూ మరోసారి పోటీకి దిగుతున్నారు. ఇరు వర్గాలూ ఇగోలకు పోకుండా రాజ్యాంగం, చట్టాలు చూపే బాటలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం హితవు పలికినా డోంట్ కేర్ అంటున్నారు.

సీఎస్.. వాటీజ్ దిస్..

ఏపీ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ని విధుల నుంచి తొలగించాలంటూ తానిచ్చిన ఆదేశాల్ని రాష్ట్ర సర్కారు అమలుచేయకపోవటంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ(సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ కి నిన్న(శనివారం) ఘాటుగా లేఖ రాశారు. ఎస్ఈసీ ఆర్డర్స్ ని పట్టించుకోకపోవటం చట్టవిరుద్ధమంటూ తప్పుపట్టారు.

బీ రెడీ టూ: AP panchayat elections

ఎన్నికల కమిషనర్ ఆదేశాల్ని పక్కనపెట్టడం అంటే సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘిస్తున్న కిందే లెక్కని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నిమ్మగడ్డ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తున్న అధికారులపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలతో ఈ నెల 23న జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ ని తానే నిలిపేశానని ప్రవీణ్ ప్రకాష్ ఒప్పుకున్న తర్వాత కూడా అతణ్ని ఉపేక్షించటం సరికాదని నిమ్మగడ్డ అసంతృప్తి వెలిబుచ్చారు.

మంత్రులా.. మజాకా..

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం షాకిచ్చారు. నిమ్మగడ్డ శుక్రవారం తమపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి ఫిర్యాదు చేయటమే కాకుండా ఆ లేఖని మీడియాకి విడుదల చేయటం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు.

AP panchayat elections : war continuing between nimmagadda, jagan
AP panchayat elections : war continuing between nimmagadda, jagan

సభా హక్కులు: AP panchayat elections

‘మంత్రులమైన మా ప్రతిష్టకు నిమ్మగడ్డ భంగం కలిగించారు’ అని పేర్కొంటూ బొత్స, పెద్దిరెడ్డి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కి కంప్లైంట్ చేశారు. ‘శాసన సభ్యులం కూడా అయిన మా హక్కులను ఎస్ఈసీ కాలరాసేలా వ్యవహరించారు’ అని, అందువల్ల ఆయనకు సభా హక్కుల నోటీసులు జారీ చేయాలని స్పీకర్ ని కోరారు. తాము లక్ష్మణ రేఖను దాటామని నిమ్మగడ్డ అనటాన్ని బొత్స ఖండించారు. మంత్రుల ఫిర్యాదును పరిశీలించిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం తన మెయిల్ ద్వారా నిమ్మగడ్డకు నోటీసులు పంపారు. అటు వైపు నుంచి ఏం రిప్లై వస్తుందో చూడాలి.

Advertisement