AP panchayat elections : ఇవి ఫేక్ న్యూస్ కాదు.. జోక్ న్యూస్..

AP panchayat elections : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆసక్తిని మాత్రమే కాదు. ఒక వైపు ప్రజాస్వామికవాదుల్లో ఆవేశాన్ని కలిగిస్తున్నాయి. మరో వైపు.. కామెడీ కోరుకునేవారికి హాస్యాన్ని కూడా పండిస్తున్నాయి. నిన్న(శనివారం) చోటుచేసుకున్న రెండు పరిణామాలు నిజంగా ఫేక్ న్యూస్ కావు. జోక్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆ రెండింటిలో ఒకటేమో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి సంబంధించింది కాగా ఇంకొకటేమో అధికార పార్టీ వైఎస్సార్సీపీకి సంబంధించింది కావటం గమనార్హం.

ఏమిటవి?..

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలు, అనైతిక చర్యలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అండమాన్ అండ్ నికోబార్ దీవుల శాఖ అధ్యక్షుడు మాణిక్యరావు ఆరోపించారు. ఏకగ్రీవాలను బలవంతంగా చేస్తున్నారని, పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల్లో సుపరిపాలనకు, స్వపరిపాలనకు ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి నేరాలకు అడ్డుకట్ట వేసి ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాణిక్యరావు కోరారు.

1,469 కి.మీ: AP panchayat elections

మాణిక్యరావు అంతటితో ఆగకుండా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖలు కూడా రాశారు. ఆంధ్రప్రదేశ్ కి 1,469 కిలో మీటర్ల దూరంలోని అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉంటున్న తెలుగువారి ప్రయోజనాల్ని పరిరక్షించటానికి ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ శాఖ ఏపీలోని అరాచకాల్ని జాతీయ పెద్దల దృష్టికి తీసుకెళ్లటం హాస్యాస్పదంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

AP panchayat elections : these are not fack news, joke news
AP panchayat elections : these are not fack news, joke news

మదనపల్లె..

ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో ఆ కుటుంబంలోని నలుగురు సభ్యులూ సత్యలోకం.. శివలోకం.. కలియుగం.. అంతం.. ఆరంభం.. అంటూ ఏదో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కదా. సరిగ్గా అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అదేదో లోకంలో ఉండి మాట్లాడుతున్నారు తప్ప ఆయనకు మైండ్ సరిగా పనిచేయట్లేదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న విమర్శించారు. సీరియస్ పాలిటిక్స్ ని రాజకీయాలతో సంబంధంలేని కరెంట్ ఇష్యూస్ తో ముడిపెట్టి విమర్శిస్తూ ఏపీలోని అధికార పార్టీవాళ్లు తమ అభిమానులకు, కార్యకర్తలకు, కేడర్ కి ఆనందం పంచుతున్నారనే టాక్ వస్తోంది.

Advertisement