AP Elections : ఒక చాప్టర్ క్లోజ్.. మూడు చాప్టర్లు స్టార్ట్..

AP Elections : ఆంధ్రప్రదేశ్ లో మొత్తానికి ఒక పనైపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక చాప్టర్ క్లోజైంది. పంచాయతీ ఎలక్షన్స్ నిన్నటితో ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీకి) మధ్య నువ్వానేనా అన్నట్లు సాగిన సమరం ఎట్టకేలకు ముగిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను మొత్తం నాలుగు దశల్లో నిర్వహించగా చివరి దశ ఆదివారం పూర్తయింది. ఫలితాలు వెలువడుతున్నాయి. టోటల్ గా చూస్తే ప్రతిపక్ష పార్టీల కన్నా అధికార పార్టీదే పూర్తిగా పైచేయి అయింది. 70-80 శాతం స్థానాలను వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుంది. మెయిన్ అపొజిషన్ పార్టీ తెలుగుదేశం ఎక్కడా కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

మనుగడ కోసం..

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క అభ్యర్థి మాత్రమే గెలిచినట్లు ఇప్పటివరకు వార్తలొచ్చాయి. హస్తం పార్టీ తర్వాత అడపాదడపా పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఉనికిని చాటుకుంది. కానీ.. దాని మిత్రపక్షం, మరో జాతీయ పార్టీ అయిన బీజేపీ ఎక్కడా నెగ్గిన దాఖలాలు కనిపించలేదు. ఇక కమ్యూనిస్టులతై పత్తా లేకుండా పోయారు. పెద్ద పెద్ద పార్టీలు విజయం సాధించిన పంచాయతీల కన్నా ఇండిపెండెంట్లు సక్సెసైన ఊళ్లే మెజారిటీగా ఉండటం గమనార్హం. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహం జగన్ పార్టీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో మునిసిపల్ ఎలక్షన్స్ లోనూ మేమే విక్టరీ సాధించబోతున్నామంటూ వైఎస్సార్సీపీ నేతలు ఉత్సాహంగా ప్రకటిస్తున్నారు.

AP Panchayat Elections : one chapter close. two chapters start
AP Panchayat Elections : one chapter close. two chapters start

ఇవి వేరు: AP Elections

స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎలక్షన్స్ మాత్రం పొలిటికల్ పార్టీల గుర్తులతో జరగవు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్ ఎలక్షన్స్ మాత్రం రాజకీయ పార్టీల గుర్తులతో, జెండాలతో నిర్వహిస్తారు. కాబట్టి అసలైన బలం ఈ ఎన్నికల్లోనే తేలుతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. పంచాయతీ ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగియటంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇక పుర, నగర పోరుపై ఫోకస్ పెట్టారు. ఈ రోజు(సోమవారం) 11 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేశారు. విజయవాడలోని ఎస్ఈసీ ఆఫీసు నుంచి జరిగే ఈ మీటింగులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది రెండో చాప్టర్. ఇక, రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే ఎలక్షన్స్ మరో రెండు ఉన్నాయి. వాటికి ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్లు కూడా వేస్తున్నారు. అవి.. 1. టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 2. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇవన్నీ పూర్తయ్యే సరికి మార్చి నెల ముగుస్తుంది.

Advertisement