AP panchayat elections : బిగ్ బ్రేకింగ్ న్యూస్ : పెద్దిరెడ్డికి పెద్ద దెబ్బ..

AP panchayat elections : ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)కి మధ్య నెలకొన్ని విభేదాలు ఈరోజు(శనివారం) తారస్థాయి చేరాయి. ఇప్పటికే మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలపై యాక్షన్ తీసుకోవాలంటూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి ఫిర్యాదు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ ఏకంగా తానే రంగంలోకి దిగి క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద షాక్ ఇచ్చారు. ఆయన్ని ఈ నెల 21 వరకు (అంటే పంచాయతీ ఎన్నికలు ముగిసే రోజు దాక) ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేయాలని ఏపీ పోలీస్ బాస్(డీజీపీ) గౌతమ్ సవాంగ్ కి ఆదేశాలు జారీ చేశారు.

‘ప్రెస్’తోనూ..

పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పెద్దిరెడ్డి మరో 15 రోజుల దాక మీడియాతో కూడా మాట్లాడేందుకు అనుమతించొద్దని ఎస్ఈసీ తేల్చిచెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేందుకు, ఓటర్లు ప్రశాంతంగా పోలింగ్ లో పాల్గొనేందుకు ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందంటూ నిమ్మగడ్డ వివరణ ఇచ్చారు. ఎస్ఈషీ జారీ చేసిన ఈ ఆదేశాలు సంచలనం రేపుతున్నాయి. మంత్రులపై చర్యల కోసం ఇప్పటివరకు గవర్నర్ కి మాత్రమే కంప్లైంట్ చేసిన ఆయన ఇప్పుడు నేరుగా తానే యాక్షన్ తీసుకోవటం గమనార్హం.

ఎందుకిలా?: AP panchayat elections

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్ శాఖకు మంత్రి. ఇప్పుడు జరుగుతున్నవి కూడా పంచాయతీ ఎన్నికలే కాబట్టి ఆయన ప్రతి విషయాన్నీ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. నిమ్మగడ్డ హద్దు దాటి చేపట్టే చర్యలను అడుగడుగునా విమర్శిస్తున్నారు. ఎస్ఈసీ తన పరిధి మీరి జారీ చేసే ఆదేశాలను ఏకపక్షంగా అమలుచేస్తే ఆ అధికారులను భవిష్యత్తులో బ్లాక్ లిస్టులో పెడతామని మంత్రి నిన్నే హెచ్చరించారు. దీంతో నిమ్మగడ్డ ఇవాళ మరింత సీరియస్ అయ్యారు. అందుకే ఇంత ఘాటుగా స్పందించారని పరిశీలకులు చెబుతున్నారు.

AP panchayat elections : big shock to minister peddireddy
AP panchayat elections : big shock to minister peddireddy

జగన్ ఏమంటారో?..

గతంలో బొత్స, పెద్దరెడ్డిలపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ కి ఫిర్యాదు చేసి ఆ విషయాన్ని మీడియాకు వెళ్లడించటంతో వాళ్లు ఎస్ఈసీపై అసెంబ్లీ స్పీకర్ కి కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదును స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి కూడా పంపించేశారు. ఆ కమిటీ ఒకసారి భేటీ అయింది. కొద్ది రోజుల్లో మరోసారి మీటింగ్ అవనుంది. ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయటంతో అది నేరుగా సీఎం జగన్ ఇగో పైన దెబ్బకొట్టినట్లే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ అర్జెంటుగా భేటీ అయిన నిమ్మగడ్డపై శాసన సభా హక్కుల నోటీసు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు.

Advertisement