Jawahar Reddy : ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రెటరీగా జవహర్ రెడ్డి.!
NQ Staff - November 28, 2022 / 10:59 AM IST

Jawahar Reddy : ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీగా అవకాశం దక్కించుకున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా జవహర్ రెడ్డి పేరు గత కొంతకాలంగా మార్మోగిపోతోంది.
1990 బ్యాచ్ సీనియర ఐఏఎస్ అధికారి అయిన డాక్టర్ జవహర్ రెడ్డి ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ టు చీఫ్ మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
డిసెంబర్ 1న బాధ్యతల స్వీకరణ
ప్రస్తుత చీఫ్ సెక్రెటరీ డాక్టర్ సమీర్ శర్మ పదవీ కాలం నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. డిసెంబర్ 1న చీఫ్ సెక్రెటరీగా జవహర్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు. డాక్టర్ గిరిధర్ అరిమానె, నీరభ్ కుమార్ ప్రసాద్, పూనమ్ మాలకొండయ్య, కరికాల వలవన్ తదితర సీనియర్ల పేర్లు చీఫ్ సెక్రెటరీ రేసులో పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది.
గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి చీఫ్ సెక్రెటరీగా అవకాశం దక్కుతుందనే ప్రచారం జరిగినా, ఆమె పేరు ఈసారి పరిశీలనకు సైతం రాలేదు.
గిరిధర్ అరమాణే చీఫ్ సెక్రెటరీ అవుతారంటూ రెండ్రోజులుగా ప్రచారం జరిగినప్పటికీ, జవహర్ రెడ్డి వైపే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.