Nimmagadda: పనిగట్టుకొని వెళ్లిన ఉద్యోగులకు నిమ్మగడ్డ ఏం బహుమతి ఇచ్చాడు

Nimmagadda:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌ను రెవిన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు శనివారం కలిశారు. అనంతరం అమరావతి జేఏసీ నేత బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. ఏపీ జేఏసీ అమరావతి పక్షాన నిమ్మగడ్డను కలిశామని బొప్పరాజు చెప్పారు. ఇక 27న కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాలను వినతిపత్రంగా అందించినట్లుగా జేఏసీ నేత బొప్పరాజు వెల్లడించారు.

ఇక కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో దేశంలో వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలని కోరామన్నారు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీ చెప్పామని తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్ ఇస్తున్నారు.. ఈ తరుణంలో హఠాత్తుగా వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ చూసి ఆశ్చర్యపోయామని బొప్పరాజు చెప్పుకొచ్చారు. ఇటువంటి తరుణంలో ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలని కోరామని ఆయన వెల్లడించారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని కూడా కమిషనర్ కు వివరించామని ఆయన చెప్పుకొచ్చారు.

ap jac meeting with ec nimmagadda నిమ్మగడ్డ
ap jac meeting with ec nimmagadda

అయితే ప్రభుత్వ ఉద్యోగులకు త్వరితగతిన వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని జేఏసీ నేత బొప్పరాజు కోరినట్లు పేర్కొన్నారు. కుదిరితే 2, 3 విడతల షెడ్యూల్‌ను కూడా వెనక్కి జరపాలని బొప్పరాజు కోరామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రీషెడ్యూల్‌ చేసే అవకాశం లేదన్నారని తెలిపారు. రాష్ట్రంలో గందరగోళం పరిస్థితి నెలకొందన్నారు. సరైన శిక్షణ లేకుండా ఎన్నికల విధుల్లోకి వెళ్లాలంటే.. ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారని చెప్పారు. చిన్న చిన్న తప్పులకు ఉద్యోగులపై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని కోరామని తెలిపారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తేనే చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈసీ తెలిపారని బొప్పరాజు వెల్లడించారు.

ఇక రాజకీయ పార్టీలు కూడా గట్టిగా పోటీ పడుతున్న సందర్భాలలో చిన్న చిన్న తప్పులకు ఉద్యోగులు పై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. యాభై సంవత్సరాల వయసు పైబడిన‌ వారిని, ఇతర దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడేవారిని, గర్భిణీ స్త్రీలు ను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశాం అని అన్నారు. ఉదయం‌ 6.30నుండి మధ్యాహ్నం 3.30కి పోలీంగ్ ముగిశాక కౌంటింగ్ ప్రారంభిస్తారు అని అన్నారు. గతంలో లాగా ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం 1.30 వరకు పోలింగ్ ఉండేలా‌ చూడాలని కోరాం అని వివరించారు.

Advertisement