Raghurama: బ్రేకింగ్ న్యూస్ : రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టు షాక్

Raghurama: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ శనివారం షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. రఘురామకృష్ణరాజును సీఐడీ న్యాయస్థానంలో హాజరుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో సీఐడీ ఆఫీసర్లు ఆయన్ని గుంటూరు జిల్లా కోర్టు క్యాంపస్ లోని 6వ అడిషనల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రఘురామకృష్ణరాజును ఏపీ పోలీసులు నిన్న హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సంబంధీకులు నిన్న రాత్రే హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు. ఎంపీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.

MP Raghurama Krishnaraju Issue

‘‘ఆది’’లోనే.. ఎదురుదెబ్బ..

రఘురామకృష్ణరాజు దాఖలుచేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే ఎంపీని అరెస్టు చేయటాన్ని ఆయన తరఫు న్యాయవాది ఆదినారాయణరావు తప్పుపట్టారు. అదుపులోకి తీసుకోవటానికి సరైన కారణాలు లేవని వాదించారు. దీంతో జడ్జి కల్పించుకొని ‘‘దీనిపై జిల్లా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదు’’ అని ప్రశ్నించారు. దీంతో ఎంపీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బెయిల్ ఇచ్చే ఛాన్స్ లేదని అప్పుడే అర్థమైంది. సీరియస్ కేస్ కావటంతో ఇక్కడికి వచ్చామని నిందితుడి తరఫు అడ్వొకేట్ చెప్పిన వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. నేరుగా ఇక్కడికి రాకుండా బెయిల్ కోసం తొలుత సెషన్స్ కోర్టుకే వెళ్లాలని సూచించింది.

MP Raghurama Krishnaraju Issue

రిమాండ్ తప్పదా..

సహజంగా ఏ నిందితుడికైనా ఏ కోర్టు అయినా ప్రాథమికంగా 14 రోజుల రిమాండ్ విధిస్తుంది. ఎంపీ రఘురామకృష్ణరాజుకు కూడా సీఐడీ న్యాయస్థానం ఇంతే వ్యవధిలో రిమాండ్ కు పంపే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిందితుడు వేరే కోర్టుకు వెళ్లటానికి ఇవాళ దాదాపుగా సమయం లేనట్లే. రేపు ఆదివారం న్యాయ స్థానాలకు సెలవు. దీంతో ఇక సోమవారమే రఘురామకృష్ణరాజుకు ఊరట లభించొచ్చని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారనే అభియోగంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్కయ్యాయి. హౌజ్ మోషన్ పిటిషన్ తో బయటపడొచ్చని రఘురామకృష్ణరాజు ఊహించినప్పటికీ ఆశాభంగం తప్పలేదు. ప్రస్తుతానికి ఆయనపై జగన్ ప్రభుత్వానిదే పైచేయి అయిందని విశ్లేషకులు చెబుతున్నారు.