Chandrababu : హైకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట.. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు..

NQ Staff - November 20, 2023 / 03:31 PM IST

Chandrababu : హైకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట.. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు..

Chandrababu :

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో గత కొన్నాళ్లుగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే.. అయితే ఈయనకు ఇన్నాళ్లకు ఈ కేసు నుండి విముక్తి లభించింది.. హైకోర్టు రెగ్యురల్ బెయిల్ మంజూరు చేసింది..

స్కిల్ కేసులో టీడీపీ చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. చంద్రబాబు తరపున లాయర్ వాదనలు విన్న న్యాయమూర్తి వారితో ఏకీభవించి చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి మల్లికార్డునరావు తీర్పు ఇచ్చారు.. రెగ్యురల్ బెయిల్ రావడంతో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్న నిబంధనలు కొన్ని తొలిగిపోయినట్టే అని చెప్పాలి.

ఇక ఇప్పుడు బెయిల్ మంజూరు చేయడానికి చంద్రబాబుకు కోర్టు ఎలాంటి షరతులు విధించింది అనేది తెలియాల్సి ఉంది.. వాదోపవాదనలు జరిగిన తర్వాత 17న కోర్టు సెషన్ ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది.. ఇక ఈ రోజు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని సిఐడి ఏపీ రాజకీయ పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటుంది అంటూ చంద్రబాబు లాయర్లు వాదించారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us