PV Sindhu: పీవీ సింధుకు న‌జ‌రానా ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. మ‌రి కేసీఆర్ ఎప్పుడో!

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ..ఒలింపిక్స్‌లో రెండో మెడ‌ల్ గెలిచి చరిత్ర సృష్టించింది. సింధు సాధించిన విజ‌యాల‌కు గాను రాష్ట్ర‌ప‌తి నుండి సినీ సెల‌బ్రిటీల వ‌ర‌కు ప్ర‌శంస‌లు కురిపించారు. సింధు సాధించిన అరుదైన ఘ‌న‌త‌కు గాను రాష్ట్ర క్రీడా విధానంలో భాగంగా న‌గదు బ‌హుమ‌తి ఇవ్వాల‌ని అధికారుల‌ని ఆదేశించారు జ‌గన్ మోహ‌న్ రెడ్డి.

PV Sindhu

2017-22 స్పోర్ట్స్ పాలసీ ప్రకారం సింధుకు రూ.30లక్షలు నజరానా అందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందని.. సింధు విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం సీఎం కొనియాడారు. క్రీడల్లో సత్తా చాటే క్రీడాకారులందరికీ ప్రభుత్వం తరుపున తగిన ప్రోత్సహం అందిస్తామన్నారు.

గత 100ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా స్వర్ణ పతకాన్ని పంచుకున్న అథ్లెట్లు 2017-22 స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించినవారికి రూ.75 లక్షలు, రజత పతకం సాధించినవారికి రూ.50 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.30 లక్షలు నగదు ప్రోత్సాహకంగా అందించనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌కి వెళ్లేముందు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్, హాకీ క్రీడాకారిణి రజనీలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నగదు సహాయం అందించింది.

ఇప్ప‌టికే సింధు ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగి. 2016లో ఆమె రియో గేమ్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన త‌ర్వాత అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు ఆమెకు డిప్యూటీ క‌లెక్ట‌ర్ జాబ్ ఇచ్చారు. అంతేకాదు అప్ప‌ట్లో రూ.3 కోట్ల న‌గదు కూడా అందించారు. ఇటు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా అప్పుడు రూ.5 కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తిని సింధుకు ఇచ్చింది. మ‌రి ఇప్పుడు ఎలాంటి న‌జ‌రానా కేసీఆర్ ఇస్తాడా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా, ఢిల్లీ, హర్యానా,మధ్యప్రదేశ్,పలు సంస్థలు అన్నీ కలిపి దాదాపు రూ.12.3కోట్ల నగదు బహుమతిని పీవీ సింధు అందుకుంది.