YS Jagan : తెలుగు బూతుల పార్టీ, రౌడీ సేన.! టీడీపీ, జనసేనపై సీఎం జగన్ విమర్శలు.!

NQ Staff - November 21, 2022 / 03:24 PM IST

YS Jagan : తెలుగు బూతుల పార్టీ, రౌడీ సేన.! టీడీపీ, జనసేనపై సీఎం జగన్ విమర్శలు.!

YS Jagan : యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పర్యటనలో భాగంగా ఓ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన షరామామూలుగానే తెలుగుదేశం పార్టీపైనా, జనసేన పార్టీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ‘దత్త పుత్రుడి’గా అభివర్ణించిన వైఎస్ జగన్, తెలుగుదేశం పార్టీని తెలుగు బూతుల పార్టీగా పేర్కొన్నారు. జనసేన పార్టీని రౌడీ సేన.. అంటూ విమర్శించారు.

బూతులు పార్టీ ఏది.?

వైసీపీలో మంత్రులే బూతులు మాట్లాడుతున్న పరిస్థితి. స్పీకర్ సైతం ఓ సందర్భంలో బూతులు మాట్లాడిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? అందుకే, వైసీపీకి వై‘కామ’ పార్టీ అనే బిరుదు కూడా ఇచ్చేశాయి విపక్షాలు.

ఇదిలా వుంటే, 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేనను ప్రజలు ఓడించారంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అది నిజమే.. కానీ, అంతకన్నా ముందు వైసీపీని కూడా అదే ప్రజలు ఓడించారు కదా.?

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇప్పుడు వైసీపీ అధికారంలో వుంది. రేప్పొద్దున్న ఇంకో పార్టీ అధికారంలోకి రావొచ్చు. ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తులు సంయమనం కోల్పోతే ఎలా.? ‘చివరి ఎన్నికలు.. అంటూ చంద్రబాబు బెదిరిస్తున్నారు..’ అన్నది వైఎస్ జగన్ ఆరోపణ. ‘ఒక్క ఛాన్స్..’ అని ఓటర్లను 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ అడగటాన్ని ఏమనాలబ్బా.?

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us