ఇది చాలామందికి ఊరట ఇస్తుంది – జగన్ సర్కార్ సంచలన నిర్ణయం !

ఏపిలో నవంబర్ 2 విద్యాలయాలు ప్రారంభం అయ్యాయి. అయితే వైస్ జగన్ సర్కార్ రాష్ట్రంలో ఉన్న టీచర్ బదిలీల పై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఉపాధ్యాయ బదిలీలకు సంబందించిన కొత్త షెడ్యూల్ విడుదల అయినా నేపథ్యంలో మరో రెండు రోజుల్లో ఈ తంతు జరగనుంది. టీచర్ బదిలీల విషయంలో కొన్ని కొత్త నిబంధలను చేర్చిన కారణం గా పాఠశాల విద్యాశాఖ నూతన ప్రణాళికతో కూడిన షెడ్యూల్‌ ని విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి. రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబరు 28, 29ల తారీకుల్లో ఈ దరఖాస్తులను పరిశీలనకు తీసుకుంటారు. ప్రొవిజినల్‌ సీనియారిటీ నుండి నవంబరు 30-డిసెంబరు 2 మధ్య పాయింట్స్ ని బేస్ చేసుకొని లిస్ట్ ని పరిశీలించనున్నారు.

వైస్ జగన్ ప్రభుత్వం డిసెంబర్ నెలలో ఈ బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలనీ భావిస్తుంది. ఒకవేళ టీచర్ల బదిలీ ప్రక్రియలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే 3, 4 తేదీల్లో వాటిని స్వీకరిస్తారు. ఈ అభ్యంతరాలను 5, 7 తారీఖుల్లో జాయింట్‌ కలెక్టర్ పరిశీలిస్తారు. పాయింట్ల ఆధారంగా డిసెంబరు 8,10 తేదీల్లో ఫైనల్ లిస్ట్ ని జారీ చేస్తారు. వెబ్‌ ఆప్షన్లను 11,15 తేదీల్లో టీచర్లనుండి అనుమతించనున్నారు. బదిలీ ఆర్డర్లను డిసెంబర్ 16 నుంచి 21 విడుదల చేస్తారు. వెబ్ ఆప్షన్లలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటె వాటికి సంబందించిన అభ్యంతరాలను డిసెంబరు 22,23 తేదీల్లో సంబంధిత శాఖలో తెలియజేయవచ్చు. బదిలీ ఆర్డర్లను డిసెంబరు 24 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ap teachers

విశ్వ విద్యాలయాలకు కొత్త వైస్ ఛాన్సులర్ ల నియామకం

ఇక గవర్నర్ సైతం విశ్వ విద్యాలయాలకు కొత్త వైస్ ఛాన్సులర్ లను నియమించడానికి అనుమతి ఇచ్చారు. న్యాయనిమునల్తో సంప్రదింపులు జరిపి వైస్ ఛాన్సలర్ ల ఫైల్ పై ఆమోదం తెలిపారు. దాంట్లో ఉన్న అభ్యంతరాలపై వివరణ సైతం తీసుకున్నారు. ఏపీ రాష్ట్రంలో ఐదు విశ్వవిద్యాలయాలకు నూతనంగా వైస్‌చాన్సలర్లను ఎంపిక చేస్తూ ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీష్ చంద్ర ఆదేశాలను జారీ చేసారు.

కొత్త వీసి లు

  • ఆంధ్రా విశ్వవిద్యాలయం: సీనియర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి
  • రాయలసీమ విశ్వవిద్యాలయం : ప్రొఫెసర్‌ ఎ.ఆనందరావు
  • శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం : రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె.రామకృష్ణారెడ్డి
  • శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం : రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె.రాజారెడ్డి
Advertisement