AP: ఇంటర్నెట్ విత్ అన్-లిమిటెడ్, హైస్పీడ్. ఇది రీఛార్జ్ ప్లాన్ కాదు..

AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చే రెండేళ్లలో వంద శాతం డిజిటల్ గా మారబోతోంది. ప్రతి ఊరుకీ ఇంటర్నెట్ (విత్ అన్-లిమిటెడ్, హైస్పీడ్) కనెక్షన్ ఇవ్వబోతున్నారు. అన్ని గ్రామాల్లోనూ ఆన్ లైన్ లైబ్రరీలు అందుబాటులోకి వస్తాయి. దీంతో విలేజ్ లోనే ఉండి వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఇంట్లోనే ఉండి అమ్మఒడి పథకం కింద ఇచ్చే ల్యాప్ టాప్ లో చదువుకోవచ్చు. 2023 మార్చి నాటికి ఇవన్నీ పూర్తికావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కూడా ఈ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలని సీఎం సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో (108 గ్రామాల్లో) అండర్ గ్రౌండ్ కేబుల్ వైర్లు వేయాలని చెప్పారు.

వచ్చే జనవరి 9న..

2022 జనవరి 9న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ల్యాప్ టాప్ కావాలని అడిగినవారికి అదే రోజు వాటిని అందించాలి. 9-12 తరగతుల విద్యార్థులకు ఈ ల్యాప్ టాప్ ఆప్షన్ ఉన్న విషయం తెలిసిందే. ల్యాప్ టాప్ సర్వీసు పక్కగా ఉండాలని సీఎం.. ఆఫీసర్లకు చెప్పారు. ఒక వేళ ల్యాప్ టాప్ ల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వాటిని గ్రామ సచివాలయంలో ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామ సచివాలయంలో ఇచ్చిన తర్వాత సర్వీస్ సెంటర్ కి పంపించి రిపేర్ చేసి వారం రోజుల్లోపు తిరిగి ఇచ్చేలా చూడాలని చెప్పారు. ల్యాప్ టాప్ లను కొనేటప్పుడు గ్యారంటీ, వారంటీ, సర్వీస్ తదితర సేవలపై ఫోకస్ పెట్టాలని అప్రమత్తం చేశారు. అన్ని రెవెన్యూ డివిజన్లలోనూ ల్యాప్ టాప్ సర్వీస్ సెంటర్లు ఉండేట్లు చూడాలని ముఖ్యమంత్రి గైడెన్స్ ఇచ్చారు.

14,671 కి.మీ. ఏరియల్ కేబుల్..

ఏపీలో ప్రస్తుతం 307 మండలాల్లోని 3,642 పల్లెల్లో 14,671 కిలోమీటర్ల మేర ఏరియల్ కేబుల్ వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 690 స్క్వేర్ ఫీట్ ఏరియాలో వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో గ్రంథాలయం ఖర్చు రూ.16 లక్షలని, 20 సీట్లు ఉంటాయని పేర్కొన్నారు. గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్, అమ్మఒడి పథకం అమలు కోసం చేయాల్సిన, జరుగుతున్న ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సోమవారం సమీక్ష జరిపారు.

Advertisement