Andhra Pradesh: మా ఊరికి రోడ్డేసే వ‌ర‌కు పెళ్లి చేసుకోనంటూ సీఎం ఆఫీసుకి లేఖ‌

Andhra Pradesh: దేశంలోని కొన్ని చోట్ల రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మ‌ధ్య ఏపీలో రోడ్లు బాగోలేవంటూ జన‌సేన పెద్ద ఎత్తున ఉద్య‌మం చేసింది. చాలా చోట్ల కూడా రోడ్ల ప‌రిస్థితి దారుణంగానే ఉంది. వ‌ర్షాల వ‌ల‌న ఇంకా పాడైపోయాయి. గ్రామీణ ప్రాంతాల‌లో రోడ్ల గురించి ప‌ట్టించుకునే నాధుడే క‌రువ‌య్యాడు.

AP Citizen Letter to Government about the Roads of His Village
AP Citizen Letter to Government about the Roads of His Village

ఈ క్రంమంలో కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయిని వినూత్న రీతిలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. తమ గ్రామానికి సరైన రోడ్లు వేసేవరకూ తాను పెళ్లే చేసుకోనని సీఎంఓ కార్యాలయానికి లేఖ రాసింది. వివరాల‌లోకి వెళితే .. దేవంగరా జిల్లా హెచ్‌ రామ్‌పురా ప్రాంతానికి చెందిన బిందు(26) ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తమ గ్రామంలో దయనీయ పరిస్థితిలో ఉన్న రోడ్లు, వాటివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కార్యాలయానికి ఓ లేఖ రాసింది.

రోడ్లు బాగు చేయించ‌క‌పోతే పెళ్లే చేసుకోను. మా గ్రామానికి స‌రైన రోడ్డు స‌దుపాయం లేక ఇంకావెన‌క‌బ‌డేఉంది. మా గ్రామ‌స్థులకి చ‌దువు లేదు. పెళ్లి సంబంధాలు కూడా రావ‌డం లేదు అని బిందు త‌న ఆవేద‌న లేఖ‌లోతెలియ‌జేసింది. అయితే ఉపాధ్యాయురాలు రాసిన లేఖకు సీఎంఓ కార్యాలయం స్పందించింది.

మీ గ్రామ సమస్యను త్వరలోనే తీరుస్తామని హామీ ఇచ్చింది. అక్కడ తక్షణమే పనులు చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయితీరాజ్ శాఖను సీఎంఓ కార్యాలయం ఆదేశించింది. జరుగుతున్న పనుల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది.