గాన గంధర్వునికి నివాళులు అర్పించిన ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయిన విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు మహానీయులను గుర్తు చేసుకుంటూ ప్రారంభించారు. మొదటగా గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. స్పీకర్ మాట్లాడుతూ.. సుమారుగా 32 భాషల్లో పాటలు పాడిన గొప్ప వ్యక్తి బాలు గారు లేకపోవడం బాధాకరం అని చెప్పుకొచ్చాడు. ఆయన ఖ్యాతిని గుర్తించడానికి నెల్లూరు లోని గవర్నమెంట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ ను ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ గా మార్చమని పేర్కొన్నారు. ఇక పేరు మార్చడానికి ఆమోదం స్పీకర్ ఆమోదం పలికారు.

Advertisement