Anil Kumble: ఏపీ సీఎంని క‌లిసిన అనీల్ కుంబ్లే.. కార‌ణం ఏంటో తెలుసా?

Anil Kumble: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను సోమవారం భార‌త మాజీ క్రికెట‌ర్ అనీల్ కుంబ్లే మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసారు. ముందు పుష్ప‌గుచ్చం జ‌గ‌న్‌కు అందించిన అనీల్ కుంబ్లే ఓ గిఫ్ట్‌ను కూడా అందించారు. ఈ గిఫ్ట్ లో అనిల్ కుంబ్లే కెరీర్ లో 10 మైలురాళ్లను ఓ ఫొటోలో పొందుపరిచి, వాటి వివరాలను కూడా ఫ్రేమ్ చేసి జగన్ కు అందించాడు.

Anil Kumble

ఇక సీఎం జ‌గ‌న్ కూడా అనీల్ కుంబ్లేకు శాలువా క‌ప్పి సత్క‌రించారు. అనంత‌రం తిరుమల తిరుపతి శ్రీనివాసుడి విగ్రహాన్ని బహూకరించారు. ప్ర‌స్తుతం వీరి మీటింగ్‌కి కార‌ణం ఏంట‌నే దానిపూ అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రాలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలుTe చేస్తున్నారని, ఆ పనులకు సంబంధించి కలిసి ఉండొచ్చ‌నే టాక్ వినిపిస్తుంది.

ఏపీ సీఎం జగన్.. రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు విశాఖపట్నంలో అకాడమీ ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం 2 ఎకరాలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న క్రీడాకారులకు సీఎం జగన్ రూ. 5 లక్షల ప్రోత్సాహం అందజేశారు.ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో కుంబ్లే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Anil Kumble

మాజీ వెటరన్ క్రికెటర్ అనీల్ టీమిండియా తరపున 18 సంవత్సరాలపాటు తన సేవలు అందించాడు. బౌలర్, కెప్టెన్, కోచ్ లాంటి ఎన్నో రకాలుగా తన విలువైన సేవలు అందించాడు. ఎన్నో రికార్డుల‌ను నెలకొల్పి భారత క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో 619 వికెట్లు తీసిన ఈ అగ్రశ్రేణి బౌలర్.. వన్డేల్లో 337 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.

తన సుదీర్ఘ కెరీర్‌లో 132 టెస్టులు, 271 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో కేరీర్‌తో మొత్తం 956 వికెట్లు పడగొట్టిన ఈ బౌలింగ్ దిగ్గజం.. 2008లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత టీమిండియాకి హెడ్ కోచ్‌ కూడా పనిచేసిన అనిల్ కుంబ్లే.. 2017లో కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా వైదొలిగాడు .ఫిబ్రవరి 7, 1999లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన అనిల్ కుంబ్లే.. ఈ ఘనత సాధించిన ఏకైక భారత బౌలర్‌గా ఇప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్నాడు.