Anil Kumar : పక్క రాష్ట్రాలే బెటర్: వైఎస్ జగన్‌కి షాకిచ్చిన వైఎస్ షర్మిల భర్త అనిల్.!
NQ Staff - December 16, 2022 / 02:07 PM IST

Anil Kumar : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి మైండ్ బ్లంక్ అయ్యేలా షాక్ ఇచ్చారు స్వయానా ఆయన సోదరి వైఎస్ షర్మిల భర్త ‘బ్రదర్’ అనిల్ కుమార్.
క్రైస్తవ మత ప్రచారకుడైన ‘బ్రదర్’ అనిల్ కుమార్, 2019 ఎన్నికలకు ముందు, వైసీపీకి ఓ వర్గం ఓటు బ్యాంకు అండగా నిలబడేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ నుంచి వైఎస్ షర్మిలకు పొగ పెట్టాక, ‘బ్రదర్’ అనిల్ కుమార్, ఏపీ రాజకీయాల్లో తెరచాటు వ్యవహారాలు షురూ చేశారు.
పక్క రాష్ట్రాలే బెటర్.. ప్రభుత్వమిచ్చే పథకాలపై ఆధారపడొద్దు..
‘పక్క రాష్ట్రాలే బెటర్ అనే స్థాయికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దిగజారిందనీ, తమ స్వార్ధం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ప్రజలు ఆధారపడవద్దనీ’ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఉద్దేశించి ‘బ్రదర్’ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా భీమిలి మండలంలోని క్రైస్ట్ కేర్ అండ్ క్యూర్ మినిస్ట్రీస్‌లో క్రిస్మస్ సంబరాల నేపథ్యంలో ఆయన అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.. పై విధంగా వ్యాఖ్యానించారు.
‘పక్క రాష్ట్రంలో పుట్టి వుంటే బావుండేదన్న భావన ఏపీ ప్రజల్లో కలుగుతోంది’ అని అభిప్రాయపడ్డారాయన. అయితే, ఎక్కడా సీఎం జగన్ పేరుని గానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుగానీ అనిల్ కుమార్ ప్రస్తావించలేదు.
‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీలో ఎవరూ టచ్ చేయలేరు’ అని ఇటీవల విజయమ్మ వ్యాఖ్యానించగా, ‘బ్రదర్’ అనిల్ కుమార్ మాత్రం, అందుకు భిన్నమైన రీతిలో వ్యవహరిస్తున్నారు.