Andhra Pradesh: స‌చివాల‌యాన్ని డాన్స్ ఫ్లోర్‌గా మార్చిన వాలంటీర్స్.. మండిప‌డుతున్న ప్ర‌జ‌లు

Andhra Pradesh: ఈ మ‌ధ్య కార్యాల‌యాల్లో డ్యాన్స్‌లు చేయ‌డం కామ‌న్‌గా మారింది. ఆ మ‌ధ్య ఓ న‌ర్సు ఆసుప‌త్రిలో బుల్లెట్ బండి సాంగ్ డ్యాన్స్ చేసి అధికారుల ఆగ్ర‌హానికి గురైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఓ వార్డు సచివాలయంలో వాలంటీర్లు చేసిన నిర్వాకం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు జిల్లా కేంద్రంలోని క‌ట్ట‌మంచి వార్డు సచివాలయంలో సిబ్బంది చేసుకున్న వేడుకలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Andhra Pradesh Secretrait Became Dance Floor by Volunteers
Andhra Pradesh Secretrait Became Dance Floor by Volunteers

విధులు నిర్వ‌ర్తించాల్సిన వారు మన్మధ రాజా… మన్మధ రాజా అంటూ డ్యాన్స్ లు చేశారు. వీటికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్స్ తిట్టిపోస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నేరుగా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో గ్రామసచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. వాలంటీర్స్ ప్ర‌తి సారి ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు పాల‌య్యేట్టు చేస్తుంది.

గ‌తంలో బర్త్ డే వేడుకలు, ఇతర సంబరాలంటూ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు గీతదాటిన సందర్భాలున్నాయి. నంద్యాల మండలం పొన్నాపురం గ్రామ సచివాలయంలో ఓ మహిళా ఉద్యోగి బర్త్ డే వేడుకలను సిబ్బంది సచివాలయ భవనంలోనే నిర్వహించారు. సినిమా పాటలు పాడుతూ డ్యాన్సులు చేశారు. క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించి డ్యాన్స్‌లు చేయ‌డం విమ‌ర్శ‌లు పాల‌య్యేలా చేసింది.

పార్టీలో పాల్గొన్న 11 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక ఇదే నెల మొదటి వారంలో చిత్తూరు జిల్లాలోనే దాదాపు 70 మందికిపైగా వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేయడం కలకలం రేపింది. గ్రామ పంచాయతీకి ఈవోగా కుసుమకుమారి ఉన్నంత వరకు తాము విధులకు హాజరు కాబోమన్నారు. మొత్తం 76 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నామని తెలిపారు. ఆమె వేధింపుల వ‌ల్ల‌నే తాము రాజీనామా చేస్తున్నామ‌ని అన్నారు.