Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి.?

NQ Staff - November 17, 2022 / 06:36 AM IST

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి.?

Andhra Pradesh : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగేందుకు అవకాశాలు చాలా చాలా తక్కువ. మరి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి.? ముందస్తు ఎన్నికల దిశగా గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నాహాలు చేసినా, ఆ తర్వాత ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

‘మేమెందుకు ముందస్తు ఎన్నికలకు వెళతాం.? మాకేమీ ఆ తొందర లేదు..’ అని కొన్నాళ్ళ క్రితం వైసీపీ అధినాయకత్వం ముందస్తు ఎన్నికల విషయమై స్పష్టతనిచ్చేసింది. కానీ, ఏపీలో ముందస్తు ఎన్నికలు వుంటాయనీ, అయితే.. అది సాధారణ ఎన్నికలకు కొద్ది నెలల ముందేనని తాజాగా కొత్త ప్రచారం తెరపైకొచ్చింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటుగా..

తెలంగాణలో 2018 చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ‘ఇంకా పది నెలలే సమయం వుంది..’ అంటూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయమై టీఆర్ఎస్ అధినేత కేసీయార్ నిన్ననే పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.

ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ గనుక తెలంగాణతోపాటుగా ఒకేసారి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే ఏపీలోనూ అక్టోబర్ – నవంబర్‌లలో ఎన్నికలు జరిగేందుకు ఆస్కారముంది.

ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అందుకే, ఏపీలోని విపక్షాలు కూడా ముందస్తు ఎన్నికలకు సర్వసన్నద్ధంగా వున్నట్లు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగా ఆయా పార్టీల కార్యకలాపాల్లోనూ వేగం పెరిగింది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us