Achennayudu : బిగ్ బ్రేకింగ్ : అడ్డంగా దొరికిన అచ్చెన్నాయుడు.. ఎలా బెదిరిస్తున్నాడో చూడు..

Achennayudu : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతోందంటూ ప్రతిపక్ష తెలుగుదేశం ఆరోపిస్తోంది కదా. కానీ.. నిజానికి అలా బెదిరింపులకు దిగుతున్నది వైఎస్సార్సీపీ కాదు టీడీపీయే అని తేలిపోయింది. ఓ అభ్యర్థిని సర్పంచ్ పదవికి నామినేషన్ వేయకుండా వార్నింగ్ ఇస్తూ పచ్చ పార్టీ నేతలే ఇవాళ అడ్డంగా దొరికిపోయారు.

అచ్చెన్న..

తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడి సొంతూరు నిమ్మాడలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ ఊరి ప్రెసిడెంట్ పదవికి అచ్చెన్నాయుడి అన్న కొడుకు కింజరపు అప్పన్న నామినేషన్ వేయటానికి వెళుతుండగా అచ్చెన్నాయుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘‘నేను అచ్చన్నను మాట్లాడుతున్నాను. మీ తమ్ముడు, మామ వచ్చారు. ఒకసారి మాట్లాడు’’ అంటూ అచ్చెన్నాయుడు వాళ్లకు ఫోన్ ఇచ్చి పక్కకు తప్పుకున్నాడు.

రచ్చ.. : Achennayudu

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పరిధిలోని నిమ్మాడ గ్రామంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కింజరపు అప్పన్న నామినేషన్ వేయకుండా అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులు, అనుచరులు, తెలుగుదేశం పార్టీవాళ్లు దౌర్జన్యం చేశారు. అంతకుముందు ఫోన్ లో అప్పన్నతో మాట్లాడి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అది కుదరకపోయే సరికి అప్పన్న ఇంటికి, ఆ తర్వాత నామినేషన్ కేంద్రం వద్దకు వెళ్లి నానా రచ్చ చేసినట్లు వార్తలొస్తున్నాయి.

అచ్చన్న అన్న..

అప్పన్న నామినేషన్ వేయకుండా అడ్డుకున్నవారిలో అచ్చెన్నాయుడి అన్న హరిప్రసాద్ కూడా ఉన్నారు. సర్పంచ్ క్యాండిడేట్ అప్పన్నని బలవంతంగా బయటకు గెంటారని తెలుస్తోంది. ఆపటానికి ప్రయత్నించిన పోలీసుల పైన, అప్పన్న పైన అచ్చెన్న అనుచరులు దాడికి దిగారు. దీంతో అప్పన్న చొక్కా చినిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజంతా నిమ్మాడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Achennayudu : achennayudu warning to his family member
Achennayudu : achennayudu warning to his family member

రాష్ట్రపతా: Achennayudu

అచ్చెన్న కుటుంబ సభ్యులు ‘‘విలేజ్ ప్రెసిడెంట్ పదవేమైనా కంట్రీ ప్రెసిడెంట్(రాష్ట్రపతి) పదవా అంటూ ఎద్దేవా చేశారు. ఆఫ్ట్రాల్ అదెంత అన్నట్లు తీసిపారేశారు. దీనికోసమే నువ్వు కుటుంబాన్ని కాదనుకుంటావా అంటూ అప్పన్నను పరోక్షంగా భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇదంతా ఫోన్ లో మాట్లాడుతూనే చేయటం గమనార్హం. ఈ ఫోన్ కాల్ ఏపీలో సంచనం రేపుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనిపై ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి.

Advertisement