Achennayudu : అచ్చెన్నా.. టూ మచ్ అన్నా..

Achennayudu : తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు మొన్న మంగళవారం జైలుకి వెళ్లే ముందు ఏమన్నాడో ఒకసారి గుర్తుచేసుకుందాం. ‘‘మళ్లీ మేము అధికారంలోకి వస్తాం. చంద్రబాబుకు చెప్పి హోం మంత్రి పదవిని నేనే తీసుకుంటా. నాపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసుల పని అప్పుడు చెబుతా. నన్ను అక్రమంగా అరెస్టు చేస్తున్న ఖాకీలు రిటైరైనా, ఈ భూమ్మీద ఎక్కడున్నా.. ప్రాణాలతో ఉంటే చాలు. వదిలే పెట్టే ప్రసక్తే లేదు’’ అని శపథం చేశాడు.

నీ సంగతేంటి?..

పోలీసులు తప్పు చేస్తున్నారంటూ అచ్చెన్న చెప్పిన ముచ్చట బాగానే ఉంది. కానీ.. ఆయన స్వయంగా తన సోదరుడి కొడుక్కి ఫోన్ చేసి పంచాయతీ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేయొద్దంటూ బంధువులతో చెప్పించిన మాట నిజమా కాదా? ఆ ఫోన్ కాల్ మీడియాలో కూడా వచ్చి వైరల్ అయింది కదా. మరి దాని మాటేంటి?.. అలా చేయటం అచ్చెన్న చేసిన తప్పు కాదా అని అధికార పార్టీవాళ్లు ప్రశ్నిస్తున్నారు. అచ్చెన్న అన్న కొడుకు, నిమ్మాడ గ్రామ సర్పంచ్ క్యాండిడేట్ అప్పన్నపై దాడి జరగలేదా? జరక్కపోతే అతని చొక్కా ఎందుకు చిరిగింది? అంటూ వైఎస్సార్సీపీవాళ్లు అడుగుతున్నారు.

ఫిర్యాదు చేసినా: Achennayudu

అచ్చెన్న బ్యాచ్ తనను బలవంతం చేసిందని, నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండా అడ్డుకుందని, వెళ్లాక నామినేషన్ వేయకుండా ఆటంకం కలిగించారని అప్పన్న చెప్పిన మాటలు అబద్ధాలా? నామినేషన్ కేంద్రంలో పచ్చ పార్టీవాళ్లు రచ్చ రచ్చ చేశారని, చివరికి పోలీసుల మీద కూడా దాడికి దిగారని ఆరోజు వార్తలు వచ్చాయి. వీటన్నింటికీ అచ్చెన్న ఏం ఆన్సర్ చెబుతారు? అని అధికార పార్టీ వాళ్లు నిలదీస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు నిందితులను పట్టుకోవద్దా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

Achennayudu : achenna.. this is toomuch
Achennayudu : achenna.. this is toomuch

జనం ఓటేస్తారా?..

మళ్లీ అధికారంలోకి వచ్చేది టీడీపీయే అని అచ్చెన్నకు ఆత్మవిశ్వాసం ఉంటే ఉండొచ్చు. తప్పులేదు. కానీ.. తన పార్టీ గెలిచాక హోం మంత్రి పదవి తీసుకుంటా, నన్ను ఇబ్బంది పెట్టిన పోలీసులను ముప్పుతిప్పలు పెడతా, మూడు చెరువుల నీళ్లు తాగిస్తానని బెదిరించటమే కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలకు మరింత సేవ చేయటానికే మంత్రి పదవి తీసుకోవాలి తప్ప ఆఫీసర్లను, పోలీసులను, ప్రత్యర్థి పార్టీవాళ్లను వేధించటానికి కాదని హితవు పలుకుతున్నారు. ఎలక్షన్స్ కే ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అప్పుడే ఇలా వార్నింగులిచ్చే నాయకులకు అసలు జనం ఓట్లేస్తారా అనే అనుమానం వస్తోంది. కాగా.. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులోని జిల్లా జైల్లో ఉన్న అచ్చెన్నాయుడికి రిమాండ్ ఖైదీ నంబర్ 8775 కేటాయించారు.

Advertisement