Connect with us

Health

341 మంది పోలీసులకు కరోనా

Published

on

Share the News from here

కరోనా చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఎవరిని వదలడం లేదు. అలాగే సినీ, రాజకీయ ప్రముఖులపై కూడా కరోనా తన ప్రభావం చూపిస్తుంది. ఇది ఇలా ఉంటె ఈ మహమ్మారి ఒకవైపు పోలీసులపై కూడా పంజా విసురుతుంది. అయితే మహారాష్ట్ర పోలీసులను కరోనా అస్సలు వదలడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 341మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. అలాగే ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు.

దీనితో ఇప్పటి వరకు కరోనా సోకినా మొత్తం పోలీసుల సంఖ్య 15,294కు చేరుకుంది. అలాగే మొత్తం కేసుల్లో 2,832 మందికి కరోనా యాక్టీవ్ గా ఉంది. అలాగే 12,306 మంది కరోనా నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక ఇప్పటివరకు కరోనా బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా 156మంది పోలీసులు మృతి చెందారు.

Do NOT follow this link or you will be banned from the site!