Connect with us

Health

ఆరోగ్యశాఖ డైరెక్టర్ కు కరోనా

Published

on

Share the News from here

దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరు కరోనా బారిన పడుతున్నారు. ఒకవైపు సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా చాలా మందికి కూడా ఈ మహమ్మారి సోకింది. దింట్లో చాలా వరకు కోలుకొని మాములు స్థితికి వచ్చారు. ఇది ఇలా ఉంటె తాజాగా గోవా రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్ జోస్ డిసా కరోనా బారిన పడ్డారు.

అయితే ఈరోజు ఆయన యాంటిజెన్‌ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆయన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరాడు. ఇక తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు కూడా వైద్యులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

Do NOT follow this link or you will be banned from the site!