Connect with us

Health

మహారాష్ట్ర పోలీసుల పై పంజా విసురుతున్న కరోనా

Published

on

Share the News from here

కరోనా దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. అలాగే దేశంలో అన్ని రాష్ట్రాల్లో కేసులు దారుణంగా నమోదవుతున్నాయి. కానీ మహారాష్ట్రలో మాత్రం కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. అయితే ఆ రాష్ట్రంలోని పోలీసులపై కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. ప్రతీ రోజు వందల సంఖ్యలో పోలీసులు కరోనా బారినపడుతున్నారు. గత 24 గంటల్లో మొత్తం 264మంది మహారాష్ట్ర పోలీసులు కరోనా బారిన పడ్డారు.

అలాగే ముగ్గురు పోలీసులను ఈ మహమ్మారి బలి తీసుకుంది. అయితే ఇప్పటివరకూ రాష్ట్రంలో 11,362 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. దాంట్లో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 121కి చేరింది. అయితే 9,187 మంది పోలీసులు కరోనా నుండి కోలుకోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 2,084 మంది యాక్టివ్ గా కేసులు ఉన్నాయని మహారాష్ట్ర పోలీసు అధికారులు వెల్లడించారు.

Do NOT follow this link or you will be banned from the site!