Connect with us

Latest News

భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త..!

Published

on

Share the News from here

ప్రస్తుత రోజుల్లో కొంతమంది మానవ సంబంధాలను మరచి తప్పు దారిన పడుతున్నారు. ముఖ్యంగా భార్య భర్తల సంబంధాలు మాత్రం కానరాకుండా పోతున్నాయి. ఇదే తరుణంలో కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను ఒక వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునాడు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అయితే రాయదుర్గంకు చెందిన రవి తన భార్య ఒక కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్నాడు.

తన భార్యను ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే పార్లర్ కు వెళ్లి వస్తానని చెప్పిన భార్య కానిస్టేబుల్ వంశీకృష్ణతో కలసి హోటల్ కు వెళ్లింది. అయితే తమ పోలీసు సిబ్బందికి విషయం చెప్పి..వారితో కలిసి హోటల్ కు వెళ్లాడు. ఇక ఆ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. పార్లర్ కు వెళుతున్నానని చెప్పి ఇంత మోసం చేస్తుందని ఊహించలేదని ఆ భర్త వాపోయాడు. ఇక తరువాత పోలీసులు ఆ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి పంపించారు.

Do NOT follow this link or you will be banned from the site!